భూముల విక్రయానికి సర్కారు ప్రకటన.. జూలై 15న ఈ-వేలం - land sales notification
07:28 June 12
ప్రభుత్వ భూముల విక్రయానికి నోటిఫికేషన్.. జూలై 15న ఈ-వేలం
నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ భూములు అమ్మాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. అమ్మకానికి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు... తాజాగా భూముల విక్రయానికి ప్రకటన జారీ చేసింది. మొదటి దశలో హెచ్ఎండీఏకు చెందిన కోకాపేట భూములతో పాటు ఖానామెట్ భూములను అమ్మనున్నారు. కోకాపేటలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన నియో పోలిస్ లేఅవుట్లోని ఏడు ప్లాట్లతో పాటు గోల్డెన్‌మైల్ లేఅవుట్లోని ఒక ప్లాట్ ఉంది.
49.92 ఎకరాల విస్తీర్ణంలోని కోకాపేటలోని ప్లాట్లు, ఖానామెట్‌లో టీఎస్ఐఐసీకి చెందిన 15.01 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. మొత్తం 64.93 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను వేలం వేయనున్నారు. ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేయనుండగా... 25న ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తారు. జూలై 13 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ కాగా... జూలై 15న ఈ -వేలం నిర్వహిస్తారు. కోకాపేట భూముల వేలం ప్రక్రియను హెచ్ఎండీఏ, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను టీఎస్ఐఐసీ నిర్వహించనుంది.