రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువు ఉంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు - telangana political news
14:54 February 23
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి తెరాస తరఫున సురభి వాణీదేవి, భాజపా నుంచి రాంచందర్‌రావు, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ నామపత్రాలు సమర్పించారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి తెరాస తరఫున పల్లా రాజేశ్వర్రెడ్డి, భాజపా నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున రాములు నాయక్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమదేవి, స్వతంత్ర అభ్యర్థులు తీన్మార్ మల్లన్న, సుదగాని హరిశంకర్ నామపత్రాలు దాఖలుచేశారు.
ఇవీచూడండి:రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల సందడి