తెలంగాణ

telangana

ETV Bharat / city

'కొవిడ్‌ నిబంధనల మేరకే శ్రీవారి దర్శనాలకు అనుమతి' - తిరుమల తిరుపతి దేవస్థానం వార్తలు

కొవిడ్‌ నిబంధనల మేరకే శ్రీవారి దర్శనాలకు అనుమతి ఇస్తున్నామని ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. వృద్ధులకు 2 స్లాట్లు కేటాయించినట్టు వస్తున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసింది. అసత్యప్రచారాన్ని భక్తులు విశ్వసించవద్దని తితిదే విజ్ఞప్తి చేసింది.

'కొవిడ్‌ నిబంధనల మేరకే శ్రీవారి దర్శనాలకు అనుమతి'
'కొవిడ్‌ నిబంధనల మేరకే శ్రీవారి దర్శనాలకు అనుమతి'

By

Published : Nov 19, 2020, 2:14 PM IST

కొవిడ్‌ నియమనిబంధనల మేరకే భక్తులను తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నామని.. 10 ఏళ్లలోపు పిల్లలను, 65ఏళ్లు దాటినవారిని అనుమతించట్లేదని ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

శ్రీవారి దర్శనానికి వచ్చే వృద్ధులకు రోజుకు 2 స్లాట్లు కేటాయించినట్టు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసంది. అసత్యప్రచారాన్ని భక్తులు విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి :మూడు ఎలుగుబంట్లు దాడి.. తలుచుకుంటే గుండెల్లో అలజడి

ABOUT THE AUTHOR

...view details