కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు వారాల పాటు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 14 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, సీపీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Curfew Extend: ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటి వరకంటే? - ఏపీలో రాత్రి కర్ఫ్యూ అప్డేట్స్
ఏపీలో రాత్రి కర్ఫ్యూను ఆగస్టు 14 వరకు పొడిగించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
కర్ఫ్యూ
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆగస్టు 14 వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి.. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర సర్కార్హెచ్చరించింది.
ఇదీ చదవండి:Vulture: రాబందుల కోసం మహారాష్ట్రను అర్థించిన తెలంగాణ