తెలంగాణ

telangana

ETV Bharat / city

NIA: మాజీ ఎమ్మెల్యే కిడారి హత్య కేసులో ఎన్ఐఏ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు

అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి హత్య కేసులో ఎన్ఐఏ.. విజయవాడలో కోర్టులో అనుబంధ ఛార్జ్‌షీట్​ను దాఖలు చేసింది. కిడారి సర్వేశ్వరరావును 40 మంది హత్య చేసినట్లు తెలిపింది. హత్యలో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు కళావతి అలియాస్ భవానీ కీలక పాత్ర పోషించారని ఛార్జీషీట్​లో పేర్కొంది.

By

Published : Jun 11, 2021, 9:44 PM IST

kidari murder case
కిడారి హత్య కేసులో ఎన్ఐఏ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు

అరకు మాజీ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు సాకె కళావతి అలియాస్ భవానీపై ఎన్ఐఏ అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసింది. తన భర్త రాష్ట్ర కమిటీ సభ్యుడు పెద్దన్న, మరో 40 మందితో కలిసి ఆపరేషన్​లో పాల్గొన్న కళావతి, హత్యకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది.

కిడారి సర్వేశ్వరరావు హత్యపై 2018 సెప్టెంబరు 23న విశాఖలో నమోదైన కేసుు.. ఆ తర్వాత ఎన్ఐఏకి బదిలీ అయింది. తొమ్మిది మంది నిందితులపై గతంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ.... ఇవాళ విజయవాడ కోర్టులో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసింది. కళావతి అలియాస్ భవానీ మావోయిస్టు సాయుధ దళాల్లో పనిచేసినట్లు ఎన్ఐఏ తెలిపింది.

ఇదీ చదవండి: covid test: కరోనా టెస్టు సమయంలో ముక్కులో విరిగిన స్క్వాబ్

ABOUT THE AUTHOR

...view details