అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామంలో ఇటుకల బట్టీల్లో పని చేస్తోన్న 32 మంది పిల్లలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ విముక్తి కల్పించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బాలల సంరక్షణ విభాగం ఛైర్ పర్సన్ రాజేశ్వరి ఇటుకల బట్టీల వద్ద కూలీలుగా ఉన్న పిల్లలను చూసి చలించిపోయారు. ఇటుకల బట్టి యజమానితో పాటు బాల కార్మిక నిర్మూలన శాఖను పర్యవేక్షిస్తోన్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హక్కుల కమిషన్ ఆదేశించింది. వారం రోజుల్లో ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని సర్కారుకు హుకుం జారీ చేసింది. ప్రస్తుతం పిల్లలను ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని బాలల సంరక్షణ శిబిరానికి తరలించారు. బాలలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఒడిశా రాష్ట్రానికి సురక్షితంగా చేర్చాలని కమిషన్ సర్కారుకు సూచించింది.
వెట్టిచాకిరి నుంచి బాలకార్మికులకు ఎన్హెచ్ఆర్సీ విముక్తి - ananthapur forced labour children news
ఇటుక బట్టీల్లో పనిచేస్తోన్న 32 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఏపీలోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కనుంపల్లి గ్రామంలో కూలీలుగా ఉన్న పిల్లలను గుర్తించిన బాలల సంరక్షణ ఛైర్ పర్సన్ రాజేశ్వరి వారిని చూసి చలించిపోయారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
వెట్టిచాకిరి నుంచి బాలకార్మికులకు ఎన్హెచ్ఆర్సీ విముక్తి