తెలంగాణ

telangana

ETV Bharat / city

న్యూజిలాండ్​ ఘటనలో ఆరుగురు హైదరాబాదీలు - firing

న్యూజిలాండ్​ క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదుల్లో జరిగిన కాల్పుల ఘటనలో 49 మంది మరణించగా.. నగరానికి చెందిన ఆరుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వారిలో ఇద్దరి వివరాలు తెలిశాయి. పోలీసులు బాధిత కుంటుంబ సభ్యులకు సమాచారమందించారు.

కాల్పులు జరుపుతున్న దుండగుడు

By

Published : Mar 16, 2019, 6:00 AM IST

న్యూజిలాండ్​ కాల్పులు
న్యూజిలాండ్​ క్రైస్ట్​చర్చ్​లోని ఓ మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారే లక్ష్యంగా ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్​కు చెందిన ​ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో అంబర్​పేటకు చెందిన జహంగీర్​, టోలీచౌకీకి చెందిన ఫర్హాజ్ హసన్​ వివరాలు పోలీసులకు తెలిశాయి. మిగతా వారి సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు.

అసదుద్దీన్​ వినతిపై కేటీఆర్​ స్పందన
జహంగీర్​ సోదరుడు ఖుర్షీద్​ ఈ విషయాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ దృష్టికి​ ​తీసుకెళ్లాడు. అసద్​ ట్విట్టర్​ ద్వారా ఖుర్షీద్​ న్యూజిలాండ్​కు వెళ్లేందుకు సహకరించాలని కేటీఆర్​కు విన్నవించారు. బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేటీఆర్​ ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. సత్వర సాయం చేయాలని ప్రవాస విభాగం అధికారులను కోరారు. కేటీఆర్​ వినతి మేరకు అధికారులు న్యూజిలాండ్​లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.

పోలీసుల ఆరా
హైదరాబాద్​ పోలీసులు న్యూజిలాండ్​ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మిగతా నలుగురి వివరాలపై ఆరా తీస్తున్నారు. అహ్మద్​ జహంగీర్​ మృతిపై సామాజిక మాధ్యమల్లో వస్తున్న వార్తలు నిజం కాదని సంయుక్త కమిషనర్​ తరుణ్​ జోషి తెలిపారు.

15 ఏళ్ల క్రితం న్యూజిలాండ్​కు
అహ్మద్​ జహంగీర్​ 15 ఏళ్ల క్రితం న్యూజిలాండ్​కు వెళ్లాడని సోదరుడు ఖర్షీద్​ తెలిపారు. అహ్మద్​కు గాయాలైన విషయం క్రైస్ట్​చర్చ్​ పోలీసులు ఫోన్​ చేసి చెప్పారని వెల్లడించాడు.

తెలియని ఫర్హాజ్​​ హసన్​ ఆచూకీ
తన కుమారుడు ఫర్హాజ్​ హసన్​ తప్పిపోయాడంటూ క్రైస్ట్​చర్చ్​ పోలీసులు చెప్పారని టోలీచౌకీలో ఉంటున్న సయీద్​ ఉద్దీన్​ తెలిపారు. ఫర్హాజ్​కు న్యూజిలాండ్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగం రావడంతో పదేళ్ల క్రితం వెళ్లాడని వివరించారు. క్రైస్ట్​చర్చిలో ఫర్హాజ్​ అతడి భార్యా, పిల్లలతో ఉంటున్నారని చెప్పారు. కాల్పుల విషయం తెలియగానే అతడి భార్యా, స్నేహితులు అక్కడి చేరుకుని విచారించగా 17 మంది ఆచూకీ తెలియలేదని.. వారిలో హసన్​ ఉండొచ్చని పోలీసులు తెలిపారన్నారు. ]

ఇవీ చూడండి:కాంగ్రెస్​కి మరో షాక్​...కారెక్కుతున్న సుధీర్​రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details