తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం కేసీఆర్​కు శుభాకాంక్షల వెల్లువ - Wishes_To_Cm

సీఎం కేసీఆర్​కు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి, ఐనవోలు దేవస్థానాల క్యాలెండర్​లు అందజేశారు.

new year wishes to cm kcr
ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

By

Published : Jan 1, 2020, 5:31 PM IST

నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదార్లు, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, కమిషన్, కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రగతిభవన్​లో సీఎంను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఉన్నతపాఠశాల విద్యార్థులకు ఇచ్చేందుకు రూపొందించిన నమూనా డిక్షనరీని విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు.

ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details