తెలంగాణ

telangana

ETV Bharat / city

"కొత్తరకం వ్యాధులు... వైద్యరంగానికే సవాల్​" - హైదరాబాద్​ మెడికల్​ హబ్

హైదరాబద్​ జూబ్లీహిల్స్​ అపోలో ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో బ్రెయిన్ అండ్ స్పైన్ సూట్​ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. జీవన విధానంలో మార్పులతో కొత్తరకం వ్యాధులు వైద్యరంగానికి సవాల్ విసురుతున్నాయని.. వీటన్నింటినీ సాంకేతికత, సమష్టి కృషితో ఎదుర్కోవాలన్నారు.

"New Types of Disease ... Clinically Challenged"
"కొత్తరకం వ్యాధులు... వైద్యరంగానికే సవాల్​"

By

Published : Dec 22, 2019, 10:14 PM IST


హైదరాబాద్​ మెడికల్​ హబ్​గా మారుతోందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్​లోని అపోలో ఆసుపత్రిలో అత్యాధునిక బ్రెయిన్ అండ్ స్పైన్ సూట్​ను లాంఛనంగా ప్రారంభించారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని మెరుగైన వైద్యసేవలందించేందుకు అపోలో ఆస్పత్రి ఎల్లప్పుడూ ముందుంటుందని కిషన్​రెడ్డి అన్నారు.

అడ్వాన్స్ ఎంఆర్ఐ మెదడు, వెన్నుముక చికిత్సలో మెరుగైన ఫలితాలకు దోహదపడుతుందని అపోలో ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి వెల్లడించారు. ఆసుపత్రులు, రోగులకు ఫ్రెండ్లీ పాలసీతో కేంద్రం ముందుకు రావాలని.. ఆయుష్మాన్ భారత్ కింద ప్రైవేటు ఆసుపత్రులకిచ్చే వైద్య ఖర్చులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

"కొత్తరకం వ్యాధులు... వైద్యరంగానికే సవాల్​"

ఇవీ చూడండి: ఐదు నెలల బాలుడు... ఉంగరాన్ని మింగేశాడు

ABOUT THE AUTHOR

...view details