తెలంగాణ

telangana

ETV Bharat / city

గోల గోల చేస్తూ... 'గోల్' చేసేద్దామా...!

వర్షాకాలంలో పిల్లలను ఆడించడం చాాలా కష్టం. బయటకు వదిలితే వర్షంలో తడిచి ఏ జ్వరమో, అంటు వ్యాధులో కొనితెచ్చుకునే ప్రమాదం ఉంది. అందుకే వారిని ఇంట్లోనే ఉంచుతూ కొత్త కొత్త ఆటలు ఆడిస్తే... చాలా బాగుంటుంది.

indore games for kids
గోల గోల చేస్తూ... 'గోల్' చేసేద్దామా...!

By

Published : Jun 14, 2020, 8:41 AM IST

చూస్తుండగానే వర్షాకాలం మొదలైంది. బయట ఆడుకుందామంటే కుదరదు. అలా అని ఆడకుండా ఉండలేం. దీనికి పరిష్కారంగా ఈ రోజు ఓ కొత్త ఇండోర్‌ గేమ్‌ ఆడటం ఎలాగో తెలుసుకుందామా. ఇద్దరు ఉంటే చాలు ఎంచక్కా ఈ ఆట ఆడేసుకోవచ్చు.

ఏమేం కావాలంటే..

  • ఓ పది పన్నెండు బెలూన్లు
  • రెండు సన్నని ప్లాస్టిక్‌ పైపులు (ప్లాస్టిక్‌ బ్యాట్‌లు, పీవీసీ పైపులు అయినా ఫర్లేదు)
  • రెండు పెద్ద ప్లాస్టిక్‌ బుట్టలు

ఎలా ఆడాలంటే..

  • అమ్మానాన్న సాయంతో ఇంట్లోనే ఓ కోర్టులాంటిదాన్ని తయారు చేసుకోండి.
  • కోర్టుకి అటూ ఇటూ రెండు ప్లాస్టిక్‌బుట్టలు పెట్టుకోండి.
  • ఇవి గోల్‌ పోస్టులన్నమాట.
  • మధ్యలో గాలి ఊది సిద్ధం చేసుకున్న బెలూన్లు పెట్టుకోండి.
  • ఇప్పుడు పైపులతో చాలా నెమ్మదిగా.. జాగ్రత్తగా.. ప్లాస్టిక్‌ బుట్టలోకి బెలూన్లను నెట్టండి. ఒకరు నెడుతుంటే.. మరొకరు అడ్డుకోకూడదు. ఇలా చేస్తే బెలూన్లు పగిలిపోతాయి.

ABOUT THE AUTHOR

...view details