కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక వైద్యం అందించే దిశగా నిమ్స్ ఆస్పత్రి మరో అడుగు వేసింది. 28 లక్షల ఖరీదైన లేజర్ చికిత్స పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫలితంగా ఎలాంటి గాటు, కోత లేకుండా కిడ్నీలో రాళ్లు సహా పలు రకాల వ్యాధులకు శస్త్ర చికిత్స చేసే అవకాశం ఏర్పడిందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ అభిప్రాయపడ్డారు. లేజర్ పరికరాన్ని గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. నిమ్స్‌లోని అన్ని విభాగాల్లోనూ ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని... ఫలితంగా నిమ్స్‌లో వైద్య సీట్లు పెరిగినట్లు నిమ్స్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఇక ఈ పరికరంతో ఇప్పటికే 11 నెలల బాలుడికి కిడ్నీ లో రాళ్లను వైద్యులు విజయవంతంగా తొలగించడం విశేషం.
అత్యాధునిక వైద్యం దిశగా... నిమ్స్
అత్యాధునిక వైద్యం అందించే దిశగా నిమ్స్ ఆస్పత్రి మరో అడుగు వేసింది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఆపరేషన్ లేకుండానే రాళ్లను తొలగించే లేజర్ చికిత్స పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
అత్యాధునిక వైద్యం దిశగా... నిమ్స్