రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 1058 కరోనా కేసులు నమోదు కాగా... నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,60,834 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,419 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కొత్తగా 1058 కరోనా కేసులు, నలుగురు మృతి - ఈరోజు కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకుంటోంది. వారం రోజుల్లో తగ్గినట్టే తగ్గిన కేసులు ఇప్పడు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా... 1058 కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు.
new corona cases in telangana
మహమ్మారి నుంచి తాజా 1,440 మంది బాధితులు కోలుకోగా... వారి సంఖ్య 2,46,733 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,682 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 10,352 మంది బాధితులుండటం గమనార్హం. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 168 కరోనా కేసులు నమోదవగా... మేడ్చల్ జిల్లాలో 93, రంగారెడ్డి జిల్లాలో 91 మంది మహమ్మారి బారిన పడ్డారు.