ఏపీలో గడిచిన 24 గంటల్లో 29,309 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 104 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,88,004కు చేరింది. గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు విడిచారు.
ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు, 2మరణాలు - కరోనా తాజా సమాచారం
ఏపీలో కొత్తగా మరో 104 మందికి కరోనా సోకింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు మరణించారని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది.
ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు, 2మరణాలు
మంగళవారం వరకు మొత్తం మరణాల సంఖ్య 7,156గా ఉంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా 147 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వీరితో కలిపి ఆ రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8.79 లక్షలకు చేరింది.
ఇదీచదవండి:కొవాగ్జిన్ సమర్థతపై కేంద్రం కీలక ప్రకటన