ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తగా మరో 8,835 కరోనా కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిసి ఏపీలో కరోనా బాధితుల సంఖ్య... 5,92,760కి చేరింది. కొవిడ్ బారిన పడి ఇప్పటివరకు 5,105 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ఏపీలో కొత్తగా 8,835 కరోనా కేసులు, 64 మరణాలు - covid cases
ఆంధ్రప్రదేశ్లో కరోనా కోరలు చాస్తోంది. కొవిడ్ కేసులు ఆరు లక్షలకు చేరువవతున్నాయి. ఇప్పటి వరకు 5,92,760 మంది మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా 8,835 కరోనా కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి.
ఏపీలో కొత్తగా 8,835 కరోనా కేసులు, 64 మరణాలు
ప్రస్తుతం 90,279 కరోనా యాక్టివ్ కేసులుండగా... కొవిడ్ నుంచి 4,97,376 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 75,013 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లండించారు.