తెలంగాణ

telangana

ETV Bharat / city

నేరేడ్​మెట్​లో కౌంటింగ్​ ప్రారంభం... కాసేపట్లో ఫలితం

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో నిలిచిపోయిన నేరేడ్​మెట్ డివిజన్​​ ఫలితం నేడు వెలువడనుంది. సైనిక్‌పురిలోని భవన్స్‌ వివేకానంద కళాశాలలో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. డివిజన్​లోని 50వ పోలింగ్‌ కేంద్రానికి చెందిన 544 ఓట్లను మాత్రమే ఇవాళ లెక్కించి, ఫలితాన్ని వెల్లడిస్తారు.

నేరేడ్​మెట్​లో కౌంటింగ్​ ప్రారంభం... 200మంది సిబ్బంది నడుమ లెక్కింపు
నేరేడ్​మెట్​లో కౌంటింగ్​ ప్రారంభం... 200మంది సిబ్బంది నడుమ లెక్కింపు

By

Published : Dec 9, 2020, 8:12 AM IST

హైదరాబాద్​లోని నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో ఎన్నికల ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా... సైనిక్‌పురిలోని భవన్స్‌ వివేకానంద కళాశాలలో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. డివిజన్‌ మొత్తంలో 25,176 ఓట్లు పోల్‌ కాగా... ఇందులో 24,632 ఓట్లు లెక్కించారు. లెక్కించకుండా పక్కనబెట్టిన 50వ పోలింగ్‌ కేంద్రానికి చెందిన 544 ఓట్లను మాత్రమే ఇవాళ లెక్కించి, ఫలితాన్ని వెల్లడిస్తారు.

అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో భాజపా అభ్యర్థిపై తెరాస అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద 200మంది సిబ్బందితో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:నేడు భారత్​ బయోటెక్​కు విదేశీ రాయబారులు, హైకమిషనర్లు

ABOUT THE AUTHOR

...view details