తెలంగాణ

telangana

MPDO Audio Viral: " రోజుకు పది తప్పనిసరి.. ఎంపీడీవో ఆడియో వైరల్"

MPDO Audio leak On OTS: ప్రతీ సచివాలయంలో రోజుకు పది చొప్పున ఓటీఎస్​ టార్గెట్లను నిర్దేశిస్తూ.. ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎంపీడీవో కింది స్థాయి ఉద్యోగులకు హుకుం జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. వివరణ ఇవ్వాలంటూ సదరు ఎంపీడీవోకు జాయింట్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

By

Published : Dec 6, 2021, 7:40 PM IST

Published : Dec 6, 2021, 7:40 PM IST

MPDO Audio Viral
ఓటీఎస్​ టార్గెట్లను నిర్దేశించిన ఎంపీడీవో ఆడియో వైరల్

MPDO Audio leak On OTS: ఏపీలో వన్ టైం సెటిల్​మెంట్ (ఓటీఎస్) స్కీమ్ రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి బలవంతంగా డబ్బు లాగుతున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఓటీఎస్ డబ్బు కట్టకపోతే సంక్షేమ పథకాలు నిలివేస్తామని స్థానిక అధికారులు, వాలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

ఓటీఎస్​ టార్గెట్లను నిర్దేశించిన ఎంపీడీవో ఆడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

Nellore MPDO Audio in social media: వారి ఆరోపణలను నిజం చేస్తూ.. తాజాగా నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎంపీడీవో సుస్మితారెడ్డి ఓటీఎస్ టార్గెట్లను నిర్దేశిస్తూ.. గ్రామ కార్యదర్శుల, వీర్వోలకు, డిజిటల్ అసిస్టెంట్లకు హుకుం జారీ చేశారు. ప్రతి సచివాలయంలో రోజుకు కనీసం పది చొప్పున ఓటీఎస్​లు పూర్తి చేసేలా చూడాలన్నారు. ఓటీఎస్ కట్టని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలపై సంతకాలు పెట్టొద్దని అధికారులను ఆదేశించారంటూ.. ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

కలెక్టర్ ఆగ్రహం.. నోటీసులు జారీ

Notices to MPDO: ఈ ఆడియో లీక్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన జాయింట్ కలెక్టర్.. వివరణ కోరుతూ మర్రిపాడు ఎంపీడీవోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

OTS in AP: ఓటీఎస్‌ వసూలుకు సకల అస్త్రాలను ప్రయోగిస్తున్న ప్రభుత్వం... వాపోతున్న లబ్ధిదారులు

ABOUT THE AUTHOR

...view details