తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు రద్దు!

భారత నౌకాదళం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా డిసెంబరు 4 నౌకాదళ దినోత్సవం రోజున విశాఖలో నిర్వహించే విన్యాసాలను ఈసారి పూర్తిగా రద్దు చేసినట్లు నౌకాదళ వర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్‌ నిబంధనల నేపథ్యమే ఇందుకు కారణమని స్పష్టం చేశాయి.

navy-day-celebrations-in-visakhapatnam-cancelled
విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు రద్దు!

By

Published : Nov 26, 2020, 8:57 AM IST

ఏటా డిసెంబర్‌ 4న ఏపీలోని విశాఖ సాగర తీరంలో ఘనంగా జరిగే నౌకాదళ విన్యాసాలకు ఈ ఏడాది విరామమేర్పడింది. కొవిడ్‌ కారణంగా ఈసారి భారత నౌకాదళ దినోత్సవంలో ఎటువంటి విన్యాసాలు నిర్వహించకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాటిని రద్దు చేశారు. అమరవీరులకు అంజలి ఘటించే కార్యక్రమం మాత్రం యధావిధిగా జరగనుంది. అందుకోసం విక్టరీ ఎట్‌ సీ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

నౌకాద‌ళ దినోత్సవం సంద‌ర్భంగా ఏటా డిసెంబ‌ర్ 4న నేవీ పాట‌వాల‌ను ప్రద‌ర్శించే కార్యక్రమం ఉంటుంది. సాహ‌సంతో కూడిన అబ్బురపరిచే విన్యాసాలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేవారు. కానీ కొవిడ్ కారణంగా వీటిని రద్దు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details