తెలంగాణ

telangana

ETV Bharat / city

MP RaghuRama issue: ఏపీ డీజీపీ, హోంశాఖకు సమన్లు జారీ చేసిన ఎన్​హెచ్​ఆర్సీ - ఏపీ డీజీపీ

ఏపీ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల సంఘం(National Human Rights Commission ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ రఘురామకృష్ణరాజు (MP RaghuRama) అరెస్టు వ్యవహారంలో నోటీసులు జారీచేసినా.. ఇంతవరకూ స్పందించలేదంటూ మండి పడింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ (AP DGP), హోంశాఖ కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది.

MP RaghuRama issue
ఎంపీ రఘురామ వివాదం

By

Published : Jun 29, 2021, 5:00 PM IST

ఎంపీ రఘురామకృష్ణరాజు (MP RaghuRama) అరెస్టు వ్యవహారంలో నోటీసులు జారీచేసినా ఇంతవరకూ స్పందించలేదంటూ.. ఏపీ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల సంఘం(National Human Rights Commission ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ (AP DGP), హోంశాఖ కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. రఘురామ అరెస్టు వ్యవహారంపై నివేదిక పంపడంలో జాప్యమెందుకు చేస్తున్నారంటూ నిలదీసింది.

హాజరు కావాల్సి ఉంటుంది..

ఆగస్టు 9వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలంటూ.. జాతీయ మానవ హక్కుల సంఘం కండిషనల్ సమన్లు ఇచ్చింది. నిర్దేశించిన గడువులోగా నివేదిక అందించకపోతే.. ఆగస్టు 16వ తేదీన డీజీపీ, హోంశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇదీ చదవండి: Viral :నిందితుల నిర్లక్ష్యానికి నిదర్శనమే ఈ దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details