తెలంగాణ

telangana

ETV Bharat / city

NGT Penalty To AP Govt: పోలవరంలో ఉల్లంఘనలు.. ఏపీకి భారీ జరిమానా - penalty to ap government

NGT Penalty To AP Gov:పోలవరం ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్​ జరిమానా విధించింది. రూ.120 కోట్లు జరిమానా వేసింది. మరో మూడు ప్రాజెక్టులకూ ఫైన్​ వేసింది. 3 నెలల్లోగా జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

NGT Penalty to AP Govt
NGT Penalty to AP Govt

By

Published : Dec 2, 2021, 7:34 PM IST

NGT Penalty To AP Govt: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్ల జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా కట్టిన మరో మూడు ప్రాజెక్టులకూ జరిమానా విధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.56 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు రూ.73.6 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.90 కోట్ల జరిమానా విధించింది.

NGT Orders to AP Govt: ఈ జరిమానాను 3 నెలల్లో చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి జరిమానా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. జరిమానా నిధుల వినియోగంపై ఏపీ పీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీకి ఫిర్యాదులు అందాయి. పెంటపాటి పుల్లారావు, వట్టి వసంతకుమార్‌ ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

ఇదీచూడండి:Devineni Uma on Minister Anil: పోలవరం సంగతి ఏమైంది?.. దేవినేని సూటి ప్రశ్న

ABOUT THE AUTHOR

...view details