రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట పోచమ్మ దేవాలయం వద్ద మంచిరేవుల, కొల్లూరుకు చెందిన ఇరువర్గాల మధ్య మద్యం మత్తులో ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు బీరు సీసాలతో కొట్టుకోవడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని పట్టుకుంటామని వెళ్లడించారు. దావత్ల పేరుతో గండి మైసమ్మ, పోచమ్మ ప్రాంతాలలో మద్యం మత్తులో గొడవలు శ్రుతిమించుతున్నారని వీటిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నార్సింగి పీఎస్ సీఐ తెలిపారు.
మద్యం మత్తులో దావత్... బీరు సీసాలతో దాడి
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట పోచమ్మ దేవాలయం వద్ద ఇరువర్గాల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముగ్గురి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం మత్తులో దావత్... బీరు సీసాలతో దాడి