NARA LOKESH BIRTHDAY: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా ట్విట్టర్లో #HBDNaraLokesh హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. హోం ఐసోలేషన్లో ఉన్న ఆయనకు సామాజిక మాధ్యమాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ కొనసాగుతోంది. దేశంలో నంబర్ రెండో స్థానం, పాలిటిక్స్ విభాగంలో మొదటి స్థానంలో ట్విట్టర్లో నారా లోకేష్ పేరు మార్మోగుతోంది.
ఉదయం 6 గంటల నుంచి వరుసగా మూడు గంటల పాటు #HBDNaraLokesh హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. దేశంలో ఇన్ని గంటల పాటు ట్రెండింగ్ అవుతూ ఉండటం ఇదే మొదటిసారని సోషల్ మీడియా ఎనలిస్టులు తెలిపారు. ట్రెండింగ్ లో ఎక్కువ శాతం యువత పాల్గొనడంతో లోకేష్ పట్ల యువత ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారని పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.