తెలంగాణ

telangana

ETV Bharat / city

వరుణ్​తేజ్​ పెళ్లి విషయంపై నాగబాబు ఏమన్నారంటే..? - వరుణ్​తేజ్​ పెళ్లి

NAGABABU COMMENT ON VARUN TEJ WEDDING: సోషల్ మీడియాలో అభిమానులతో నాగబాబు చిట్‌చాట్‌ చేసే సందర్భంలో.. వరుణ్‌తేజ్‌ పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి తనదైన శైలిలో సమాధానం చెప్పి తప్పించుకున్నాడు నాగబాబు.

NAGABABU COMMENT ON VARUN TEJ WEDDING
NAGABABU COMMENT ON VARUN TEJ WEDDING

By

Published : Mar 22, 2022, 4:56 PM IST

NAGABABU COMMENT ON VARUN TEJ WEDDING: సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే నాగబాబుకు అభిమానుల నుంచి ఎప్పుడూ ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. తాజాగా ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో నాగబాబు చిట్‌చాట్‌ చేసే సందర్భంలోనూ వరుణ్‌తేజ్‌ పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి తనదైన శైలిలో సమాధానం చెప్పి తప్పించుకున్నాడు నాగబాబు. "వరుణ్‌ తేజే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాడంటూ" దాటవేశాడు.

వరుణ్‌తేజ్‌ వివాహం గురించి గతంలో ఓ నెటిజన్‌ నాగబాబును ప్రశ్నించగా.. దానికి ఆయన ఇచ్చిన కౌంటర్‌ అందర్నీ ఎంతగానో నవ్విస్తోంది. "వరుణ్‌తేజ్‌-సాయిపల్లవిల జోడీ చూడచక్కగా ఉంటుంది. కాబట్టి వాళ్లిద్దరికి పెళ్లి చేసేస్తా" అంటూ ఓ నెటిజన్‌ నాగబాబుకు పోస్ట్‌ పెట్టాడు. దానిపై స్పందించిన ఆయన 'జాతిరత్నాలు' చిత్రంలో బ్రహ్మానందం చెప్పే.. "తీర్పు కూడా మీరే ఇచ్చుకోండ్రా. అరేయ్‌ మనమెందుకు ఇక్కడ వెళ్లిపోదాం రండి" అనే వీడియోతో నెటిజన్‌కు కౌంటర్‌ వేశారు. మరోవైపు, ఇటీవల కాలంలోనే "వరుణ్‌ అన్నకు పెళ్లి ఎప్పుడు చేస్తారు?" అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. "మంచి సంబంధాలు ఉంటే చూడండి" అని నాగబాబు సమాధానమిచ్చారు.

ఇదీ చూడండి:కోల్​కతాలో 'ఆర్ఆర్ఆర్'.. రూ.400కోట్ల 'రాధేశ్యామ్'... 'అవతార్-2' ట్రైలర్​!

ABOUT THE AUTHOR

...view details