ఎమ్మార్పీఎస్ పోరాటం ఎస్సీల్లో ఆత్మ విశ్వాసం పెంచిందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ రిజ్వరేషన్ విభజన జరగాలని ఉషా మెహతా కమిషన్ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా ఈదుముడిలో మాదిగ ఆత్మగౌరవ సభకు నిర్వహించారు. 25 ఏళ్ల క్రితం ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ఈదుమూడి వేదికైందని గుర్తు చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వర్గీకరణ అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. ఎస్సీల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని అన్నారు. సభలో కాంగ్రెస్ నేత రఘవీరా రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
"ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం" - mandhakrishna madiga
ఎమ్మార్పీఎస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఈదుముడిలో మాదిగ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ పోరాటాలు ఎస్సీల్లో ఆత్మవిశ్వాసం పెంచిందని మందకృష్ణ మాదిగ అన్నారు. సభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు.
mandakrishna