మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌కు రైతుబంధు పథకం నిలిపివేయడంపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామానికే ప్రభుత్వ పథకం ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. 'రాజకీయ కక్షలు కాదు... రాజకీయ విజ్ఞత ప్రదర్శించండి.. లక్ష్మాపూర్ గ్రామానికి తక్షణమే రైతుబంధు పథకం అమలు చేయండి' అని ట్వీట్ చేశారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడికి ఓట్లు వేయలేదని రైతులపై కక్ష కట్టారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
రాజకీయ కక్షలు కాదు... రాజకీయ విజ్ఞత ప్రదర్శించండి: ఎంపీ రేవంత్‌రెడ్డి
మంత్రి మల్లారెడ్డి అల్లుడికి ఓట్లు వేయలేదనే... లక్ష్మాపూర్ గ్రామంపై కక్ష కట్టి, రైతుబంధు పథకం నిలిపివేశారని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజకీయ కక్షలు వదిలేసి... తక్షణమే రైతుబంధు పథకం అమలు చేయాలని ట్వీట్ చేశారు.
ఓట్లు వేయలేదని రైతులపై కక్ష కట్టారు: రేవంత్