తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడితే దేశద్రోహమేనా...?' - mp revant on sedition case

2014 నుంచి ఇప్పటి వరకు నమోదైన దేశద్రోహం కేసుల వివరాలు కోరుతూ... ఎంపీ రేవంత్​రెడ్డి లేవనెత్తిన అంశం లోక్​సభలో ఈరోజు చర్చకు వచ్చింది. కేసుల విషయంలో హోంశాఖ నుంచి తనకు లభించిన సమాధానం అరకొరగా ఉందని సభ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు.

mp revanth reddy on Treason case in lok sabha
mp revanth reddy on Treason case in lok sabha

By

Published : Mar 16, 2021, 3:29 PM IST

'కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడితే దేశద్రోహమేనా...?'

కేంద్ర ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను తప్పుపట్టే వారిపై దేశద్రోహం కేసులు పెట్టి వేధిస్తున్నారని లోక్​సభలో ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు నమోదైన దేశద్రోహం కేసుల వివరాలు కోరుతూ... రేవంత్​రెడ్డి లేవనెత్తిన అంశం సభలో ఇవాళ చర్చకు వచ్చింది. కేసుల విషయంలో హోంమంత్రిత్వ శాఖ నుంచి తనకు లభించిన సమాధానం అరకొరగా ఉందని రేవంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు.

'ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించినా... ప్రశ్నించినా... బాధ్యత గుర్తుచేసినా... అది దేశ ద్రోహం కిందకు రాదన్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం ఎవరు విమర్శలు చేసినా... 124 (ఏ) కింద కేసులు నమోదు చేస్తోంది. ఇవన్నీ పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసులు. రైతుల ఉద్యమానికి మద్ధతిచ్చారన్న ఒకే ఒక్క కారణంతో దిశ రవిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రభుత్వాన్ని కోర్టు తప్పుపట్టింది.

-రేవంత్ రెడ్డి

2021 జనవరి 26న రైతుల ర్యాలీ సందర్భంగా చాలా మంది రైతులపై దేశద్రోహం కేసులు నమోదు చేశారని... వాటిని ఎత్తివేయాలని రేవంత్‌ డిమాండ్​ చేశారు. ఎంతో మందిపై పెట్టిన ఈ కేసులు విచారణకు రాకుండా... నాలుగైదేళ్ల పాటు పెండింగ్​లోనే పెడుతున్నారన్నారు. కేసులు ఉన్నాయన్న కారణంగా ఉద్యోగాలు రాక, పాస్​పోర్టు, వీసాలు రాక యువత ఇబ్బంది పడుతున్నారని సభలో రేవంత్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:నిజామాబాద్‌లో పసుపు బోర్డు అవసరం లేదు: కేంద్రం

ABOUT THE AUTHOR

...view details