తెలంగాణ

telangana

ETV Bharat / city

అనిశా అభియోగాల్లో ఎలాంటి నిజం లేదు: రేవంత్​

ఓటుకు నోటు కేసు విచారణను అనిశా న్యాయస్థానం చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టం వర్తించనప్పుడు అనిశా న్యాయస్థానం పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

mp revanth reddy counter petition on acb court
mp revanth reddy counter petition on acb court

By

Published : Dec 22, 2020, 8:54 PM IST

ఓటుకు నోటు కేసు విచారణను అనిశా న్యాయస్థానం చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ప్రధాన నిందితుడుగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అనిశా అభియోగాల్లో ఎలాంటి నిజం లేదని.. ఒకవేళ పరిగణలోకి తీసుకున్నప్పటికీ... అవి అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

పబ్లిక్ సర్వెంట్​గా తన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అనిశాఎక్కడా పేర్కొనలేదని... కాబట్టి అవినీతి నిరోధక చట్టం వర్తించదన్నారు. అవినీతి నిరోధక చట్టం వర్తించనప్పుడు అనిశా న్యాయస్థానం పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పిటిషన్​పై విచారణను అనిశా కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇవాళ విచారణకు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు.

ఇదీ చూడండి: 65 గంటలపాటు పెయింటింగ్​... మాస్టారు గిన్నిస్​​ రికార్డ్

ABOUT THE AUTHOR

...view details