తెలంగాణ

telangana

ETV Bharat / city

వైకాపా నేతల తీరుపై విమర్శలు గుప్పించిన ఎంపీ - జగన్ బర్త్ డే వేడుకలపై రఘురామ వ్యాఖ్యలు

వైకాపా నేతల తీరుపై ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం జగన్​ పుట్టినరోజు సందర్భంగా చిరు వ్యాపారుల దగ్గర డబ్బులు వసూళ్లు చేయడమేంటని ప్రశ్నించారు. వ్యక్తిగత కార్యక్రమాలకు కూడా ఇలా వసూళ్లు చేస్తారా అని నిలదీశారు. ఇలాంటి చర్యలు ఆపాలని.. సీఎం జగన్ దృష్టి సారించాలని కోరారు.

mp-raghurama-krishnam-raju-serious-comments-on-cm-jagan-birthday
వైకాపా నేతల తీరుపై విమర్శలు గుప్పించిన ఎంపీ

By

Published : Dec 19, 2020, 10:04 PM IST

ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పేరిట చిరు వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఈ నెల 21న సీఎం జగన్ జన్మదినాన్ని అట్టహాసంగా చేయాలని పార్టీ నాయకత్వం దిగువ స్థాయి వరకు ఆదేశాలు పంపిందని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు పార్టీ ప్రతిష్ట, సీఎం గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా తన అభిప్రాయాలను చెప్పారు. తన భావనను సీఎం పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టాలని కోరారు.

'ఈ నెల 21 సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు. పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు వసూళ్ల పర్వం చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి నాకు చాలా ఫొన్ కాల్స్ వస్తున్నాయి. కింది స్థాయి నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. దుకాణాదారులు, చిన్న వ్యాపారులను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసం..? మీ వ్యక్తిగత కార్యక్రమాలకు ఇలా చందాలు వసూలు చేయడం బాగా లేదు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మా పార్టీ అధ్యక్షుడు జగన్​కు సలహా ఇస్తున్నాను'

- రఘురామకృష్ణరాజు, నర్సాపురం ఎంపీ

ఇదీ చదవండి :కేసీఆర్​ ఫాం హౌజ్​లో ఏదో ఉంది.. డీజీపీ తనిఖీ చేయాలి: బండి

ABOUT THE AUTHOR

...view details