తెలంగాణ

telangana

ETV Bharat / city

RRR LETTER: 'సర్పంచ్ అధికారాల్లో కోత ప్రజాస్వామ్యానికి చేటు' - సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌

ఏపీ సీఎం జగన్​కు ఎంపీ రఘురామ మరో లేఖ రాశారు. సర్పంచ్ అధికారాల్లో కోత ప్రజాస్వామ్యానికి చేటు అని లేఖలో విమర్శించారు.

mp raghurama krishna
ఎంపీ రఘురామ లేఖ, 8వ లేఖ

By

Published : Jun 27, 2021, 9:58 AM IST

Updated : Jun 27, 2021, 10:16 AM IST

ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. 'నవ ప్రభుత్వ కర్తవ్యాలు' పేరుతో ఎనిమిదో లేఖ సంధించారు. సర్పంచ్ అధికారాల్లో కోత ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. పంచాయతీలు ప్రజాస్వామ్య స్ఫూర్తిగా నిలుస్తున్నాయని.. కానీ ఆంధ్రప్రదేశ్​లోని గ్రామసభల కార్యాచరణ సరిగా లేదని విమర్శించారు.

సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌పై సందిగ్ధత గందరగోళానికి దారితీసిందని లేఖలో పేర్కొన్నారు. సర్పంచ్‌లు బ్యాంకుల నుంచి నిధులు ఉపసంహరించలేని పరిస్థితి నెలకొందని..వారి నిస్సహాయత అభివృద్ధికి ఆటంకంగా మారిందని తెలిపారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ కార్యదర్శులు జవాబుదారీ కాదని లేఖలో వెల్లడించారు.

ఇదీ చదవండి:మరియమ్మ కేసులో చౌటుప్పల్​ ఏసీపీపై వేటు

Last Updated : Jun 27, 2021, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details