జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రత్యేక ప్రమాణాలేమైనా ఉన్నాయా అని తెరాస లోక్సభాపక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సౌకర్యం ప్రయోజనాన్ని స్థానికులకు అందించాలన్న ప్రతిపాదన ఏమైనా ఉందా అని అంశాన్ని నామ లేవనెత్తారు.
పాఠశాలల ఏర్పాటు నిరంతర ప్రక్రియ: కేంద్రం
దేశంలో జవహర్ నవోదయ పాఠశాలల ఏర్పాటు ఓ నిరంతర ప్రక్రియ అని కేంద్రం సమాధానమిచ్చింది. నిధుల లభ్యత, అధికారుల అనుమతితో కొత్త విద్యాలయాలను ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 56 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేశామని.. గ్రామీణ ప్రాంతాల్లో తెలివైన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు వీలవుతుందని వివరించింది.
పెండింగ్ నిధులు ఎప్పుడిస్తారు?: నామ
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సహాయం మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రతిపాదన వచ్చిందా అని లోక్సభలో నామ ప్రశ్నించారు. పెండింగ్ నిధులపై పూర్తి వివరాలను తెలియజేయాలని కేంద్రాన్ని కోరారు. ఎప్పటిలోగా నిధులు విడుదల చేస్తారో స్పష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు.