MP Komatireddy Venkatareddy tweet for KTR comments: ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ మారుతున్నారని.. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ ప్రకటన రాజకీయ జిమ్మిక్కుగా అభివర్ణించారు. అసత్య ప్రచారాలు చేసి లబ్ధిపొందాలని చూడడం... హుందా రాజకీయం అనిపించుకోదని విమర్శించారు.
కేటీఆర్‌కు కోమటిరెడ్డి కౌంటర్.. ఎన్నికలకు ముందే విదేశాలకు ఎంపీ! - భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి
MP Komatireddy Venkatareddy tweet for KTR comments: కేటీఆర్ కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు జిమ్మిక్కుగా అని అభివర్ణించారు. తమ ఐక్యతకు భారత్ జోడో యాత్రనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికలకు ముందే కోమటిరెడ్డి విదేశాలకు వెళ్లనున్నారు.
ఎపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విటర్
తమ ఐక్యతకు భారత్ జోడో యాత్రనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక ఈనెల 14న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్నట్లు తెలిసింది. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు తర్వాతే తిరిగి రానున్నట్లు సమాచారం. మునుగోడు ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చేసిన విజ్ఞప్తికి వెంకట్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈలోగానే విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: