తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేటీఆర్‌ను మళ్లీ ప్రభుత్వంలో భాగస్వామిగా చూసేందుకు ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. గతేడాది ఒప్పో.. ఇటీవల అమెజాన్.. ఇవాళ వన్‌ప్లస్‌తో హైదరాబాద్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందన్న ఓ పాత్రికేయుడి ట్వీట్‌పై అసదుద్దీన్ స్పందించారు. ఆ ఘనత కేటీఆర్దేన్న ఎంఐఎం అధినేత.. ఆయనను మంత్రిగా చూసేందుకు వేచిచూస్తున్నట్లు తెలిపారు. స్పందించిన కేటీఆర్.. ఎంపీ అసదుద్దీన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కేటీఆర్‌పై ఎంపీ అసదుద్దీన్ ఆసక్తికర ట్వీట్
కేటీఆర్‌పై ఎంపీ అసదుద్దీన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మళ్లీ ఆయన్ను ప్రభుత్వంలో భాగస్వామిగా చూడాలనుకుంటున్నట్లు ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.
కేటీఆర్‌పై ఎంపీ అసదుద్దీన్ ఆసక్తికర ట్వీట్