తెలంగాణ

telangana

ETV Bharat / city

అరెస్టులతో ఉద్యమం అణిచివేయలేరు: నారాయణ - tsrtc strike today

కూనంనేని సాంబశివరావు ఆమరణదీక్ష భగ్నంను ఖండిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.

అరెస్టులతో ఉద్యమం అణచివేయలేరు: నారాయణ

By

Published : Oct 28, 2019, 9:40 AM IST

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కూనంనేని సాంబశివరావు శాంతియుత పద్దతిలో దీక్ష చేస్తుంటే.. పోలీసులు అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిన్న అర్ధరాత్రి వైద్యపరీక్షల పేరుతో పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజా ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న విధంగా... ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని నారాయణ తెలిపారు.

అరెస్టులతో ఉద్యమం అణచివేయలేరు: నారాయణ

ABOUT THE AUTHOR

...view details