విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు - moola nakshatram news
15:21 October 21
విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు
ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా?లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొండ చరియలు విరిగిపడగా.. ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు కాసేపట్లో సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి రానున్నారు. ఏపీ సీఎం పర్యటన నేపథ్యంలో ఆ ప్రదేశంలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.