సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత తన ఇద్దరు కుమారులతో సహా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివాహిత అంజలి మృతిచెందగా.. ఆమె కుమారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కుమారులతో సహా వివాహిత ఆత్మహత్య.. మహిళ మృతి - suicide attempt
భర్త వేధింపులు తాళలేక పార్సిగుట్ట న్యూ అశోక్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత ఇద్దరు కుమారులతో కలిసి విషం తాగింది. ఈ ఘటనలో వివాహిత మృతిచెందగా...ఆమె ఇద్దరు కుమారుల పరిస్థితి విషమంగా ఉంది.
పార్సిగుట్ట న్యూ అశోక్‌నగర్‌లో ప్రసాద్, అంజలి దంపతులు నివాసం ఉంటున్నారు. పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. మొదట్లో బాగానే ఉన్న... తర్వాత దంపతులిద్దరూ తరచూ గొడవలు పడతుండేవారని స్థానికులు తెలిపారు. కొన్ని రోజుల క్రితమే భర్తపై అంజలి వరకట్న వేధింపుల కేసు పెట్టినట్లు తెలిపారు. అనంతరం భర్త వేధింపులు మరీ ఎక్కువ కావడం వల్ల ఇద్దరు కుమారులకు విషం ఇచ్చి ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అంజలి మరణించగా.. ఇద్దరు కుమారులు ప్రాణాలకోసం కొట్టుమిట్టాడుతున్నారు. అంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: పదోతరగతి విద్యార్థిని బలవన్మరణం.. వేధింపులే కారణం