తెలుగు బాషా పరిరక్షణలో భాగంగా ఏటా ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో ఖతార్‌లో మాతృభాష దినోత్సవ వేడుకలు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 21న ఖతార్‌లోని ఐసీసీ అశోకా హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖతార్‌లోని తెలుగు వారి నుంచి అపూర్వమైన స్పందన లభించిందని ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల తెలిపారు.
ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో ఖతార్‌లో మాతృభాష దినోత్సవ వేడుకలు మాతృభాషను ప్రోత్సహించాలనే..
తెలుగు వారందరిలో మాతృభాష పట్ల అభిమానాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో తమ కార్యవర్గ బృందం చేసిన కృషి ఫలించిందని ఆయన పేర్కొన్నారు. యువత, పెద్దలకు మాతృ భాష పట్ల స్ఫూర్తిని కలిగించేలా మూడు రోజుల పాటు చిట్టి గీతాలు, పద్యాలు, శతకాలు, ప్రముఖ వ్యక్తులపై ప్రసంగాలు, సామెతలు, కథలపై పోటీలు నిర్వహించామని వెల్లడించారు. ఈ పోటీల్లో చిన్నపిల్లల నుంచి 65 ఏళ్ల వయసు వరకు అభ్యర్థులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఉత్సాహవంతంగా మలిచారని చెప్పారు.
ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో ఖతార్‌లో మాతృభాష దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు
చిన్నారుల అద్భుతమైన ప్రదర్శనలు(ఏకపాత్రాభినయం, నృత్యాలు, పాటలు), తెలుగు బాషా బోధనా ఉపాధ్యాయులను న్యాయనిర్ణేతలను వేదికపై సన్మానించటం ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయని వెంకప్ప భాగవతుల తెలిపారు. పోటీలలో విజేతలుగా నిలిచినవారికి పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శిరీష, సుధ వ్యవహరించగా, ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి తన సందేశంతో కార్యక్రమం ముగించారు.
ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన దాతలకు, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు, స్వచ్ఛంద సేవకులకు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ ప్రెసిడెంట్ పీఎన్ బాబు రాజన్, జనరల్ సెక్రెటరీ కృష్ణ కుమార్, ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్ కేఎస్ ప్రసాద్, ఐసీబీఎఫ్ నుంచి రజనీ మూర్తి, ఇతర ప్రముఖ తెలుగు సంఘాల అధ్యక్షులు, వారి కార్యవర్గ బృంద సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఇదీ చూడండి: