ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామానికి చెందిన రమాదేవి ఒకేసారి ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు చిన్నారులు ఆరోగ్యంగా ఉండగా.. మరో బాబు ఆయాసంతో బాధపడుతున్నాడు. ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టడంపై తల్లిదండ్రులు, వారి కుటుంబీకులు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను చూసి ముచ్చటపడుతున్నారు. శిశువులను చూసేందుకు చాలా మంది తరలి వస్తుండటంతో ఆస్పత్రిలో సందడి వాతావరణం నెలకొంది.
ఒకే కాన్పులో ముగ్గురు పండంటి శిశువులు జననం - తెలంగాణ వార్తలు
అనంతపురం జిల్లా గుంతకల్లు స్వప్న నర్సింగ్ హోంలో ఒకే కాన్పులో ముగ్గురు పండంటి పిల్లలు పుట్టారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఆరోగ్యంగా ఉండగా.. మరో బాబుకు ఆయాసం ఉన్నట్టు గుర్తించిన వైద్యులు.. చికిత్స అందిస్తున్నారు.
ఏడో నెల నుంచి సాధారణ కాన్పు కోసం చికిత్స అందించామని ముగ్గురు పిల్లలు ఒకే కాన్పులో జన్మించడం అరుదుగా జరుగుతుందని.. అదికూడా నార్మల్ డెలివరీ కావడం, తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటం సంతోషంగా ఉందని డాక్టర్ రమణ తెలిపారు. ప్రస్తుతం చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని అయితే బరువు తక్కువగా ఉండటంతో చిన్నపిల్లల ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ముగ్గురు శిశువుల్లో ఒక శిశువుకు ఆయాసం ఉండటంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.
ఇదీ చదవండి:ACCIDENT: అమ్మకు ఆయువు తీరింది.. పాపాయికి కన్నీరే మిగిలింది..