కళ్లముందే పిల్లను కోల్పోయిన ఓ తల్లి శునకం మూగ రోదన మనసును కదిలించింది. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా పాడేరులో అప్పటివరకూ చెంగుమంటూ తిరిగిన ఓ బుజ్జి కుక్కపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. టైరు చక్రాల కింద నలిగిపోయిన ఆ మూగ జీవి... క్షణాల్లో విగతజీవిగా మారింది. ఊహించని విషాదంతో కడుపు కోతకు గురైన తల్లి, కుక్కపిల్ల మృతదేహం వద్దే విచారంగా ఉండిపోయింది.
బిడ్డను కోల్పోయిన ఓ మూగజీవి ఎదురు చూపులు - బిడ్డను కోల్పోయిన ఓ మూగ జీవి కన్నీటి గాధ
కళ్లముందే బిడ్డను కోల్పోయిన ఓ తల్లి శునకం మూగ రోదన మనసును కదిలించిన ఘటన ఏపీలోని విశాఖ జిల్లా పాడేరులో కనిపించింది. కడపు కోతకు గురైన తల్లి... కుక్కపిల్ల మృతదేహం వద్దే విచారంగా ఉండిపోయింది. ఎప్పటికైనా లేస్తుందేమోనని ఆశతో ఎదురు చూస్తూ... గడిపింది.
బిడ్డను కోల్పోయిన ఓ మూగజీవి ఎదురు చూపులు
ఎప్పటికైనా లేస్తుందేమోనని ఆశతో ఎదురు చూస్తూ గడిపింది. చెవులు కొరికి లేపేందుకూ ప్రయత్నించింది. తెల్లార్లూ కంటికి కునుకు లేకుండా రోడ్డుపైనే ఎదురు చూసిన దృశ్యం చూపరుల హృదయాలు ద్రవించాయి.