తెలంగాణ

telangana

ETV Bharat / city

twins died: పదో అంతస్తు నుంచి కింద పడిన పిల్లలు - ఫేస్‌బుక్​

ఫేస్‌బుక్​ మీద ఉన్న ఆసక్తి తన పిల్లల మీద ఉండి ఉంటే బతికేవారని గ్రహించలేకపోయింది ఓ తల్లి. బయటివారు వచ్చి చెప్పేవరకు కూడా ఆమె.. తన ఇద్దరు పిల్లలు ప్రాణాలతో లేరని తెలుసుకోలేకపోయింది. ఈ ఘటన రొమేనియాలో జరిగింది.

romenia
romenia

By

Published : Sep 14, 2021, 8:52 PM IST

సోషల్ మీడియాలో మునిగి ప్రపంచాన్ని మరిచిపోయే వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇదే కొవకు చెందిన ఓ తల్లి ఫేస్‌బుక్​లో మునిగిపోవడం వల్ల తన ఇద్దరు చిన్నారుల ప్రాణాలు పోగొట్టుకుంది.

రొమేనియాలోని ప్లోయిస్టి నగరానికి చెందిన ఆండ్రియాకు ముగ్గురు పిల్లలు. వారిలో ఇద్దరు కవల పిల్లలు(2). ఆండ్రియా తన స్నేహితురాలైన అలీనాకు తన పిల్లలను చూసుకోమని చెప్పింది. ఆండ్రియా మాత్రం ఫేస్‌బుక్‌ లైవ్ స్ట్రీమింగ్‌లో బిజీగా ఉంది. ఈ సమయంలో తన పిల్లల సంగతి మరచింది. ఆమె తన కవల పిల్లలు ఆడుకుంటూ పదో అంతస్తు నుంచి కింద పడినా పట్టించుకోలేదు. విషయం తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెకు చెప్పేవరకు కూడా తల్లి ఆండ్రియా ఫేస్‌బుక్​లోనే మునిగి ఉండడం గమనార్హం.

ఇదీ చూడండి:Saidabad incident: ఇంకా దొరకని కామాంధుడు.. కారణం అదే.. ఇవిగో సీసీటీవీ దృశ్యాలు..!

ABOUT THE AUTHOR

...view details