తెలంగాణ

telangana

ETV Bharat / city

పలకాబలపం పట్టేస్తా... ఆడుతుపాడుతు తిరిగేస్తా... - monkey

కర్నూలు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినేందుకు ఓ కొండముచ్చు రోజూ వస్తోంది. విద్యార్థులతో తరగతి గదుల్లో కూర్చోవడమేగాక... అందరితోపాటే మధ్యాహ్న భోజనం తింటోంది. పాఠశాల ముగిశాక బాధతో స్నేహితులకు వీడ్కోలు పలికినట్లుగా అందర్నీ కౌగిలించుకుని మరీ వెళ్లిపోతోంది.

monkey

By

Published : Jul 30, 2019, 10:35 AM IST

పలకాబలపం పట్టేస్తా... ఆడుతుపాడుతు తిరిగేస్తా...

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం వెంగలాంపల్లి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులతోపాటు ఓ కొండముచ్చు రోజూ తరగతులకు హాజరవుతోంది. సమీపంలోని కొండల్లో నివసించే ఈ వానరం కొన్నిసార్లు రోజంతా పాఠశాలలోనే గడుపుతోంది

సాధారణంగా కోతిని చూస్తే పిల్లలు హడలిపోతారు. లేదా దాన్ని ఏడిపించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ కొండముచ్చు కొద్దిరోజుల్లోనే పిల్లలకు స్నేహితుడిలా మారిపోయింది. బడికి వచ్చింది మొదలు పిల్లలతో ఆటలు మొదలెడుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉంటే మాత్రం గోల చేయకుండా పాఠాలు వింటోంది.

పిల్లలను ఏమీ అనకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం వల్ల ఉపాధ్యాయులూ దాన్ని తరిమేయలేదు. అంతేగాక తననీ ఓ విద్యార్థిగా భావించి పాఠాలు చెబుతున్నారు.

ఆదివారం పాఠశాలకు వచ్చి విద్యార్థులు ఎవరూ లేకపోయేసరికి నిరాశగా వెనక్కి వెళ్లిపోతుంది. మిగిలిన రోజుల్లో కొండముచ్చుకు టాటా చెప్పనిదే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంటికిపోరు. అందరికీ వీడ్కోలు పలికాక కొండల్లోకి నడుచుకుంటూ పోతుందీ కొండముచ్చు.

ఇదీ చూడండి:ఎస్సైకి ముద్దిచ్చాడు.. అరెస్ట్ అయ్యాడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details