గవర్నర్ ప్రసంగంలో ఉద్యోగులు, ఉద్యోగాల భర్తీ ప్రస్తావన ఎందుకు లేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రశ్నించారు. విద్యారంగం అంటే కేవలం గురుకులాలే అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉద్యోగులు, నిరుద్యోగుల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేనందున ఆ ప్రసంగానికి మద్దతు తెలుపనని నర్సిరెడ్డి స్పష్టం చేశారు.
గవర్నర్ ప్రసంగంలో ఉద్యోగులు, ఉద్యోగాల భర్తీ లేదు: నర్సిరెడ్డి - telangana varthalu
ఉద్యోగులు, నిరుద్యోగుల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేనందున ఆ ప్రసంగానికి మద్దతు తెలుపనని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మండలిలో తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో ఉద్యోగులు, ఉద్యోగాల భర్తీ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు.
గవర్నర్ ప్రసంగంలో ఉద్యోగులు, ఉద్యోగాల భర్తీ లేదు: నర్సిరెడ్డి
సన్నబియ్యం పాఠశాలలకు పంపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ మండలంలో కొన్ని గ్రామాలకు భగీరథ కనెక్షన్ ఇవ్వలేదని తెలిపారు. కల్యాణలక్ష్మీ డబ్బులు సంవత్సరమైనా రావడంలేదని.. పాత వాళ్లకు తప్ప కొత్త వాళ్లకు ఆసరా పెన్షన్లు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి:ఉద్యోగులకు గుడ్న్యూస్..సభలోనే పీఆర్సీ ప్రకటిస్తానన్న కేసీఆర్