ఈ నెల 13 నుంచి 16 వరకు నల్గొండ నుంచి హైదరాబాద్కు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సమస్యల పరిష్కారంతోపాటు కేంద్ర బడ్జెట్లో సవరణలు చేయాలన్న డిమాండ్లతో పాదయాత్ర చేపట్టినట్టు వెల్లడించారు. న్యాయమైన ఫిట్మెంట్తో వేతన సవరణ, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, అంతర్ జిల్లా బదిలీలకు షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నల్గొండ నుంచి హైదరాబాద్కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాదయాత్ర - telangana latest news
ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 13న నల్గొండ నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. కేంద్ర బడ్జెట్లో కూడా సవరణలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతిస్తూ... ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తోందని నర్సిరెడ్డి ఆరోపించారు. యూనివర్సిటీల్లో వీసీలు, ఆచార్య, సహాయ ఆచార్య ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, బడ్జెట్లో విద్య, శిశుసంక్షేమానికి నిధులు పెంచాలన్నారు. ఎల్ఐసీ, విశాఖ ఉక్కు పరిశ్రమ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, సీసీఎస్ విధానం రద్దు చేసి పాత పింఛనును అమలు చేయాలని కోరారు.
ఇదీ చూడండి:రాష్ట్ర రైతులు కూడా గళమెత్తాలి: మంత్రులు