మహిళలు బయటి కంటే ఇంట్లోనే ఎక్కువ హింసకు గురవుతున్నారని.. ఎవరికీ చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాగోల్‌లో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సంఘమిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో... సీపీ మహేశ్ భగవత్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం పలువురికి సంఘమిత్ర అవార్డులను అందజేశారు.
'బయటి కంటే ఇంట్లోనే మహిళలకు ఎక్కువ హింస' - సీపీ మహేశ్ భగవత్
హైదరాబాద్ నాగోల్‌లో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సంఘమిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఆడవాళ్లను రక్షించేందుకు కృషిచేస్తున్న పోలీసు వ్యవస్థను కవిత ప్రత్యేకంగా అభినందించారు.
mlc kavitha participated in sangamitra awards distribution
తెలంగాణ అంటేనే ఆడబిడ్డలను గౌరవించుకునే గడ్డ అని కవిత తెలిపారు. రాష్ట్రంలో మహిళా రక్షణకు సర్కారు ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. ఆడవాళ్లను రక్షించేందుకు కృషిచేస్తున్న పోలీసు వ్యవస్థను కవిత ప్రత్యేకంగా అభినందించారు. అందరం సంఘటితమైతే.. బలం పెరుగుతుందని మహిళలకు సూచించారు. సంఘమిత్ర పేరుతో మహిళలంతా ఒక్కదగ్గరికి రావటం అభినందనీయమన్నారు. తనను ఓ సంఘమిత్రగా చేర్చుకోవాలని కవిత కోరారు.