MLC Kavitha Tweet on NDRF Funds: ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుంచి రాష్ట్రానికి కేంద్రం ఒక్కపైసా విడుదల చేయలేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. 2021-22 సంవత్సరంలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన జాతీయ విపత్తుల ఉపశమన నిధుల వివరాలను ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. కేంద్రం విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పేరే లేదని కవిత ప్రస్తావించారు. వరదలతో అల్లాడిపోయిన రాష్ట్రానికి 1,350 కోట్ల రూపాయల తక్షణ సాయంతో కలిపి 5 వేల కోట్ల రూపాయల ఎన్డీఆర్‌ఎఫ్ నిధులివ్వాలని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రధానమంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు.
కేంద్రం విడుదల చేసిన ఆ నివేదికలో తెలంగాణ పేరే లేదు: ఎమ్మెల్సీ కవిత - జాతీయ విపత్తుల ఉపశమన నిధులు
MLC Kavitha Tweet on NDRF Funds: హైదరాబాద్కు వరద సాయం అందించడంలో భాజపా ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 2021-22 సంవత్సరంలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన జాతీయ విపత్తుల ఉపశమన నిధుల వివరాలను ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
MLC Kavitha Tweet
భారీ వర్షాలు, వరదలతో 2020లో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్కు సీఎం కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉండగా.. కేంద్రం ఏ మాత్రం ఆదుకోలేదని విమర్శించారు. వరద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకుందని గుర్తుచేశారు. ప్రతీ అంశంలో తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షపూరిత వైఖరి మనసును కలచి వేస్తోందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:ఒక మహిళను గౌరవించే విధానం ఇదేనా..? : గవర్నర్ తమిళిసై