తెలంగాణ

telangana

ETV Bharat / city

'విశ్వసనీయత ఉన్న వార్తలు రాసేవారే సమాజంలో పేరు పొందుతారు..'

MLC Kavitha Speech: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులందరిని ఒక్కచోటకు తీసుకువచ్చి శిక్షణ ఇవ్వడం శుభపరిణామమని కవిత అభిప్రాయపడ్డారు.

mlc kavitha comments on women journalists in  Telangana State Media Academy training program
mlc kavitha comments on women journalists in Telangana State Media Academy training program

By

Published : Apr 24, 2022, 8:18 PM IST

MLC Kavitha Speech: సంచలనం సృష్టించే వార్తలు రాసే వారు కొద్దిరోజుల వరకే నిలబడతారు.. కానీ విలువలతో కూడిన వార్తలు రాసే వారే ఎక్కువ కాలం నిలబడతారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. విశ్వసనీయత కల్గిన వార్తలు రాసేవారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలరని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు హైదరాబాద్​ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించారు. రెండు రోజుల శిక్షణ అనంతరం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టుందరిని ఒక్కచోటకు తీసుకువచ్చి శిక్షణ ఇవ్వడం శుభపరిణామం అని కవిత తెలిపారు. ఫోర్త్ ఎస్టేట్​గా ఉన్న మీడియాలో మహిళా భాగస్వామ్యం రోజురోజుకు పెరగడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.

"ఏ రంగంలో అయిన సమస్యలు ఉంటాయి. అందులో మహిళలకు మరో 50 శాతం సమస్యలు అధికం. ఎన్ని ఇబ్బందులొచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేయాలి. జర్నలిజంలో విశ్వసనీయత చాలా ముఖ్యం. 2001లో కేసీఆర్​ జై తెలంగాణ అన్నారు. అనగానే ఎవరూ ఆయనను నమ్మలేదు. కానీ.. తెలంగాణ వచ్చే వరకు జై తెలంగాణ అంటూనే ఉన్నారు. అదే విశ్వసనీయత. ఏ వార్త రాసినా.. సవివరంగా సమగ్రంగా రాయాలి. అప్పుడే ఆ జర్నలిస్టుపై నమ్మకం ఏర్పడుతుంది."- కవిత, ఎమ్మెల్సీ

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details