తెలంగాణ

telangana

ETV Bharat / city

MLC ANANTHA BABU: ఎమ్మెల్సీ అనంతబాబు తరలింపుపై పోలీసుల గోప్యత - సర్పవరం అతిథిగృహానికి అనంతబాబును తరలిస్తున్నట్లు సమాచారం

MLC ANANTHA BABU: ఏపీ కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు తరలింపుపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. అనంతబాబు తరలింపు విషయంలో ఎలాంటి సమాచారాన్ని పోలీసులు ఇవ్వడం లేదు.

ANANTHA
ANANTHA

By

Published : May 23, 2022, 6:58 PM IST

MLC ANANTHA BABU: ఏపీ కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు తరలింపుపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. అనంతబాబు తరలింపు విషయంలో ఎలాంటి సమాచారాన్ని పోలీసులు ఇవ్వడం లేదు. సర్పవరం అతిథిగృహానికి అనంతబాబును తరలిస్తున్నట్లు సమాచారం... వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును వైద్యపరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. కాకినాడ ఏఆర్‌ కార్యాలయం నుంచి జీజీహెచ్‌కు తరలించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

వైద్య పరీక్షల తర్వాత అనంతబాబును మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.. కాకినాడ ఏఆర్‌ కార్యాలయంలో అనంతబాబును ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు అనంతబాబు తెలిపినట్లు సమాచారం.. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యంతో హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం.. కాకినాడలో ఈ నెల 19న కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే..

ABOUT THE AUTHOR

...view details