తెలంగాణ

telangana

ETV Bharat / city

Viral comment: ఆ ఇళ్లలో కొత్త దంపతుల శోభనం కష్టమేనట..!

ఏపీ నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న ఇళ్లపై(Jagananna houses) ఎమ్మెల్యే నల్లపురెడ్డి(MLA NALLAPUREDDY) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిలోని పడకగది కొత్త జంట కలిసి నిద్రించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేటీలో సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయి.

జగనన్న ఇళ్లు,  జగనన్న ఇళ్లపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు
జగనన్న ఇళ్లు, జగనన్న ఇళ్లపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు

By

Published : Jun 27, 2021, 12:48 PM IST

Updated : Jun 27, 2021, 1:09 PM IST

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని జగనన్న ఇళ్లపై సొంత పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(MLA NALLAPUREDDY) కామెంట్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. కట్టిన ఇంటి బెడ్ రూము కొత్త జంటలకు కూడా పనికిరావని కోవూరు నల్లపురెడ్డి అభిప్రాయపడ్డారు. నెల్లూరులో జరిగిన హౌసింగ్ సమావేశంలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మించిన పడక గదిలో కనీసం ఇద్దరు పడుకోవడం కూడా అసాధ్యమని పేర్కొన్నారు.

జగనన్న ఇళ్లు చాలా బాగున్నాయి. కానీ బెడ్​రూంల విషయానికొస్తే... పెళ్లైన కొత్త జంటల శోభనానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. చాలా చిన్న బెడ్ రూమ్. కొత్తగా పెళ్లైన జంటలకే కాదు సార్.. లబ్ధిదారులకు కూడా నైట్ టైమ్ ఏదన్న పని చేసుకోవాలంటే... చాలా ఇబ్బంది సార్. మంచం కొలతలేసి చేయిస్తేనే సరిపోతుంది. పెద్ద మంచం కొంటే అందులో పట్టనే పట్టదు. మీరు ఆ బాత్రూమ్​లను బయట పెట్టించి బెడ్రూమ్​లను పెద్దగా కట్టిస్తే బాగుంటది సార్. అనిలన్న నియోజకవర్గంలో అయితే... హాలు చాలా పెద్దగా ఉంది. ఆ ఇళ్లలో ఉండే వాళ్లు హాల్లో శోభనం చేసుకొని... బెడ్రూంలోకి వెళ్లి పడుకోవాలి సార్. చాలా అన్యాయం సార్ ఇది. - ఎమ్మెల్యే నల్లపురెడ్డి

జిల్లాకు సంబంధించి వైఎస్సార్ జగనన్న(Jagananna houses) గృహ నిర్మాణాల ప్రగతి సమీక్షా సమావేశంలో హౌసింగ్ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పాల్గొన్నారు.

ఆ ఇళ్లలో కొత్త దంపతులు పడుకోవడం కష్టమే..: నల్లపురెడ్డి

ఇవీ చదవండి:Cold: జలుబు చేసిందా... అయితే మంచిదే!

Last Updated : Jun 27, 2021, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details