తెలంగాణ

telangana

ETV Bharat / city

రెవెన్యూ బిల్లు ఆమోదంతో సీఎం కేసీఆర్​కు అభినందనల వెల్లువ - రెవెన్యూ బిల్లు ఆమోదం

శాసనసభలో రెవెన్యూ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదించడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్​కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సంస్కరణలకు కేసీఆర్... మారుపేరని కొనియాడారు. బిల్లు ఆమోదంతో తెలంగాణ భవన్‌లో తెరాస శ్రేణులు సంబురాలు చేశాయి.

cm kcr
cm kcr

By

Published : Sep 11, 2020, 8:23 PM IST

రాష్ట్ర రెవెన్యూ శాఖలో కీలక ముందడుగు పడింది. నూతన రెవెన్యూ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రెవెన్యూ బిల్లుతో పాటు పలు బిల్లులకు సభ ఆమోదముద్ర వేసింది. రెవెన్యూ బిల్లు ఆమోదంతో మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్​కు అభినందనలు తెలిపారు. రెవెన్యూ శాఖలో సంస్కరణలు మొదలయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంస్కరణలకు కేసీఆర్​ మారు పేరని కొనియాడారు. శాసనసభలో ముఖ్యమంత్రి విజయచిహ్నం ప్రదర్శించారు.

కొత్త రెవెన్యూ బిల్లు ఆమోదంతో తెలంగాణ భవన్‌లో తెరాస శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశాయి.

రెవెన్యూ బిల్లు ఆమోదంతో సీఎం కేసీఆర్​కు అభినందనల వెల్లువ

ఇదీ చదవండి:నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details