తెలంగాణ

telangana

ETV Bharat / city

10వేల లీటర్ల శానిటేషన్​ కెమికల్​ పంపిణీ - కరోనా వైరస్​

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్​లో రసాయనాలను పిచికారి చేయాలని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్​ ఆదేశించారు. తన వంతు సాయంగా 10 వేల లీటర్ల శానిటేషన్​ కెమికల్​ను నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేశారు.

mla
10వేల లీటర్ల శానిటేషన్​ కెమికల్​ పంపిణి

By

Published : Apr 13, 2020, 3:32 PM IST

కరోనా వైరస్​ను నిర్మూలించేందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్​లో శానిటేషన్ కెమికల్స్​ను చల్లుతున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళ్​రావు నగర్ డివిజన్​లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద రసాయనాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

నియోజకవర్గంలో తన వంతు బాధ్యతగా ప్రతి డివిజన్​లో నిత్యావసర సరుకుల పంపిణి, పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం 10వేల లీటర్ల శానిటేషన్ కెమికల్​ను 10 వాహనాల ద్వారా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు పంపించారు.

ఇవీచూడండి:కరోనాకు తోడు తుపాను బీభత్సం- ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details