MLA Balakrishna at nimmakuru: ఏపీలోని కృష్ణా జిల్లా నిమ్మకూరులో శనివారం (మే 28) ఉదయం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. వేడుకలను పురస్కరించుకొని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. నిమ్మకూరుకు చేరుకున్నారు. అక్కడ బంధువుల యోగక్షేమాలను బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులతో మాటామంతి.. భోజనం అనంతరం ఈ రాత్రికి నిమ్మకూరులోనే ఆయన బస చేయనున్నారు.
అభిమానులకు బాలకృష్ణ కృతజ్ఞతలు.. వీడియో విడుదల.. - అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో విడుదల చేసిన బాలకృష్ణ
శనివారం (మే 28) ఎన్టీఆర్ శత జయంతి వేడుకను పురస్కరించుకొని ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా నిమ్మకూరుకు చేరుకున్నారు. ఈ రాత్రికి నిమ్మకూరులో బాలయ్య బస చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను జరుపుకుంటున్న తెలుగువారు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ బాలకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు.
balakrishna
ఈ సందర్భంగా.. గ్రామంలో అడుగడుగున ఎన్టీఆర్ పాత సినిమా ఫ్లెక్సీలను స్థానికులు ఏర్పాటు చేశారు. అంతకుముందు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకను జరుపుకుంటున్న తెలుగు ప్రజలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. బాలకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు.
ఇవీ చదవండి: