తెలంగాణ

telangana

ETV Bharat / city

Hindupuram MLA Balakrishna : 'హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆగదు' - Balakrishna on District Issue

Hindupuram MLA Balakrishna : హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆగదని బాలకృష్ణ స్పష్టం చేశారు.

Hindupuram MLA Balakrishna
Hindupuram MLA Balakrishna

By

Published : Feb 5, 2022, 2:17 PM IST

హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆగదు

Hindupuram MLA Balakrishna : హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ పోరాటం కొనసాగుతోంది. నిన్న మౌనదీక్ష చేపట్టిన బాలకృష్ణ.. ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. హిందూపురం నుంచి అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చేరుకున్నారు. బాలకృష్ణతో పాటు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Hindupuram As District Headquarters : హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని బాలకృష్ణ డిమాండ్​ చేశారు. హిందూపురం కేంద్రంగా జిల్లాకు సత్యసాయి పేరు పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు. హిందూపురం జిల్లా కేంద్రం కోసం దేనికైనా సిద్ధమేనని.. అలా ప్రకటించేవరకు పోరాడతానని తెలిపారు.

దేనికైనా సిద్ధం.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..

Balakrishna on District Issue : సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాలంటూ.. స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలో నిన్న భారీ ఆందోళన నిర్వహించారు. హిందూపురంలో పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి ర్యాలీగా తరలివెళ్లిన బాలకృష్ణ.. అంబేడ్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. బాలకృష్ణ వెంట భారీగా పార్టీ శ్రేణులతోపాటు అఖిలపక్ష సభ్యులు , విద్యార్థులు, యువకులు తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ నినదించారు.

AP New Districts Issue : ఎన్‌టీఆర్‌ పేరుతో జిల్లా కేంద్రం ప్రకటించి అభిమానం ఉన్నట్లు చెబుతున్న జగన్‌.. అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేశారని బాలకృష్ణ ప్రశ్నించారు. రాత్రికి రాత్రి జిల్లాలు ప్రకటించి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం జిల్లా కేంద్రం సాధించేందుకు అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని బాలకృష్ణ ప్రకటించారు. హిందూపురంలో అన్ని వసతులు ఉన్నాయన్న ఆయన..జిల్లా కేంద్రం సాధన కోసం ఎంతవరకైనా పోరాడతానని స్పష్టం చేశారు. మన ప్రాంతం, మన రాష్ట్రం బాగుండాలనేదే తన కోరికన్న బాలకృష్ణ.. అవసరమైతే పుట్టపర్తిలోనూ ఆందోళన చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details